![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -719 లో..... కావ్యకి రాజ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యదు. అప్పుడే అపర్ణ, అప్పు, కళ్యాణ్ వస్తారు. రాజ్ ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదని అడుగుతారు. ఇక ఆయన్ని డిస్టబ్ చెయ్యాలనుకోవడం లేదని కావ్య బాధపడుతుంది. వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ని చూసి కావ్య టెన్షన్ పడుతుంది. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని రాజ్ అడుగుతాడు. నేను మీతో ఎందుకు మాట్లాడాలని కావ్య కఠినంగా మాట్లాడుతుంది. దాంతో రాజ్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
అదంతా రాహుల్, రుద్రాణి చూసి మనకి కావల్సింది కూడా అదేగా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి యామినిని కలుస్తారు. నువ్వు కావ్యని తక్కువ అంచనా వెయ్యకు రాజ్ ఎప్పుడు నీ సొంతమని వాళ్ళకి నమ్మకం కలిగించాలని రుద్రాణి చెప్తుంది. సరే రేపు మా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మీ ఇంటికి రాజ్ ని తీసుకొని వస్తానని యామిని చెప్తుంది. సరే కానీ కావ్య ఆ ఇంటికి కోడలు అన్న విషయం చెప్పకు.. ఎందుకంటే కావ్యకి పెళ్లి అయిందని.. భర్త ఉన్నాడన్న ఆలోచన వచ్చి కనుక్కోనే ప్రయత్నం చేస్తాడు. దాంతో తన గతాన్ని తనే కనుక్కుంటాడని రుద్రాణి అనగానే.. సరేనని యామిని అంటుంది. రాజ్ రెడీ అవుతుంటే యామిని తన దగ్గరికి కి వెళ్లి మాట్లాడుతుంది. మనం ఇప్పుడు నీ ఫ్రెండ్ కళావతి దగ్గరికి వెళ్తున్నాం. తన నిజస్వరూపం నీకు తెలుస్తుందని రాజ్ ని తీసుకొని కావ్య దగ్గరికి వెళ్తుంది యామిని.
రాజ్ ని తీసుకొని యామిని రావడంతో అందరు షాక్ అవుతారు. మా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని యామిని అంటుంది. తరువాయి భాగంలో సడెన్ గా అపర్ణ వస్తుంది. ఆవిడ గుర్తుందా నువ్వు తనతో కేక్ కట్ చేయించావ్.. ఆమె మీ ఫ్రెండ్ కళావతి వాళ్ళ అత్తయ్య అని యామిని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. నాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదని కావ్య వంక రాజ్ కోపంగా చూస్తాడు. కావ్య ఏదో చెప్పబోతుంటే.. ఇంకేం వద్దని రాజ్ అంటాడు. దాంతో కావ్య బాధపడుతుంది. రాజ్ దృష్టిలో కావ్యని ఒక చీటర్ గా క్రియేట్ చెయ్యాలనుకున్న యామిని సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |